రాష్ట్రంలో రేపటి నుండి వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి

Rains in the state from tomorrow: Meteorological department reveals

హైదరాబాద్‌ః రాష్ట్రంలో శుక్రవారం నుంచి వర్షాలు కురి సే అవకాశం ఉందని వాతావరణ శాఖ అం చనా వేస్తున్నది. బంగాళాఖాతం సముద్ర మ ట్టం నుంచి 4.5 నుంచి 7.6 మి.మీ ఎత్తు మధ్య లో ఆవర్తనం ఉన్నది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న ఆవర్తన ద్రో ణి 18వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 20న కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.