తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో వర్షాలు

ఏపీలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు , రేపు తెలంగాణ లో పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈసారి రుతుపవనాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. ఈపాటికే తొలకరి జల్లులు పడడం , రైతులు విత్తనాలు పెట్టడం మొదలుపెట్టాలి. కానీ ఈసారి వర్షాలు ఇంకా మొదలుకాకపోవడం తో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జాయ్ తీవ్ర తుఫాన్ వల్ల స్తంభించిన రుతుపవనాలు.. మళ్లీ ఆదివారం నుంచి విస్తరించడం మొదలుపెట్టాయి. ఏపీలోని అన్ని ప్రాంతాలకు ఇవి విస్తరిస్తుండగా.. త్వరలోనే తెలంగాణలోకి కూడా ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా నేడు, రేపు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

నేడు వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.