మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ చేసారు అధికారులు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతుండడం తో నగరంలోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో భారీగా వరద నీరు మూసీ నదిలోకి వచ్చి చేరుతోంది. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

పలువురు అధికారులు బ్రిడ్జి వద్దకు వచ్చి అక్కడి అక్కడి పరిస్థితి తెలుసుకొని..రాకపోకలను నిలిపివేయడమే బెటర్ అని నిర్ణయించి..బ్రిడ్జ్ ఫై రాకపోకలను బంద్ చేసారు. బ్రిడ్జికి ఇరువైపులా భారీ గేట్లు వేసి క్లోజ్ చేశారు. ఎవరూ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగించవద్దని అధికారులు సూచించారు. జంట జలాశయాల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో మూసీకి వరద ప్రవాహం పెరిగిందన్నారు. వరద ప్రవాహం పెరుగుతుందని ముందుగానే బ్రిడ్జిని క్లోజ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మార్గం గుండా వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక గత రాత్రి హైదరాబాద్ లో భారీగా వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగా..పలు కాలనీ లోని ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. మరో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.