మాస్కో-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు కాల్

మాస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం అర్ధరాత్రి ఇ-మెయిల్‌ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యింది.

అప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసి, విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 400 మంది ప్రయాణికులు ఉన్నారు. అనుమానాస్పద వస్తువులేమీ కన్పించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచామని అన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణకు ఆదేశించారు