ఐసిస్ ఉగ్ర సంస్థ టాప్‌ కమాండర్‌ అరెస్ట్‌

మునీబ్ మహమ్మద్ ను అరెస్ట్ చేసిన అఫ్గన్ భద్రతా దళాలు

terrorist
terrorist

అఫ్గనిస్థాన్‌: అఫ్గనిస్థాన్‌ భద్రతా దళాలు ఐసిస్ ఉగ్ర సంస్థ ఖొరసాన్ విభాగానికి చెందిన టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను అరెస్ట్ చేశాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ తెలిపింది. మునీబ్ ది పాకిస్థాన్ అని వెల్లడించింది. అయితే మునీబ్ పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో పాటు ఉగ్ర సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, లష్కరే తాయిబా, జమాత్ ఉల్ ఉలేమా, సిపా ఈ సహబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాక మునీబ్ అత్యంత కీలకమైన ఉగ్రవాది మునీబ్‌ ఐసిస్ లో చేరక ముందు మునీబ్ లష్కరే తాయిబాలో కీలకంగా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. మునీబ్‌ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/