బాలయ్య ను చూస్తూ ఈలలు వేసిన బామ్మ ..

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107 మూవీ షూటింగ్ ప్రస్తుతం కర్నూల్ లో జరుగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ను చూసేందుకు ప్రజలు , అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా కరోనా నుండి క్షేమంగా బయటపడిన బాలకృష్ణ..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. గత కొద్దీ రోజులుగా కర్నూల్ లోని పలు చోట్ల ఈ మూవీ షూటింగ్ జరుగుతుండడం తో అభిమానులు , పెద్దవారు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు చేరుకొని జై బాలయ్య అంటూ వారి అభిమానాన్ని పంచుకుంటున్నారు. అయితే బాలయ్యను చూసేందుకు వచ్చిన అభిమానులలో ఓ బామ్మ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. రోడ్డుపైనే జై బాలయ్య అంటూ ఈలలు వేస్తూ.. ఎంతో ఎనర్జీగా డ్యాన్స్​ వేసి అందర్నీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.