నాల్గు రోజుల పాటు తెలంగాణ వర్ష సూచన..

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అందువల్ల ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నేడు కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే అక్కడి ప్రజలు అలర్ట్‌గా ఉండాలి.

ఇంకా భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అంటే హైదరాబద్ మహా నగరంలో కూడా వానలు ఇంకా పడనున్నాయి. అందవల్ల సిటీ ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఏవైనా పనులు ఉంటే.. అందుకు తగినట్లు ప్రణాళికలు రచించుకోవాలి అన్నారు.

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం.. ఉందని తెలిపింది. ఇక ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.