రూ.2000 నోట్లపై ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

RBI శుక్రవారం పెద్ద నోట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. 2016లో నోట్ల రద్దు దరిమిలా చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. రూ.2 వేల నోట్లు ఇవ్వడం తక్షణం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. అయితే.. నిర్ణీత కాలపరిధిలో రూ. 2000 కరెన్సీ ఉపయోగంలో లేకుండా చేసేందుకు, ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి/మార్చుకోవడానికి తగినంత సమయం ఉండేందుకు వీలుగా.. సెప్టెంబరు 30 దాకా ఈ నోట్లు చలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది.

RBI నిర్ణయంపై ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. అనకాపల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో అవినీతి పరులు ఉన్నారని, డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ తానే ఇచ్చానన్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే రిపోర్ట్ ఇచ్చానని గుర్తుచేశారు. తాజాగా ఆర్బీఐ రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. దేశ సంపద కొందరు మాత్రమే దోచేస్తున్నారు… అందుకే పెద్ద నోట్లు రద్దు చేయమని కేంద్రానికి సూచించినట్లు తెలిపారు.