తండ్రైన గీత గోవిందం ఫేమ్ రాహుల్

గీత గోవిందం ఫేమ్ రాహుల్ రామకృష్ణ సంక్రాంతి వేళ తండ్రయ్యాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియ‌జేశారు. సంక్రాంతి పండుగ రోజున కొడుకు పుట్టాడ‌ని తెలియ‌జేస్తూ సంక్రాంతి రిలీజ్ అని త‌ల్లి ద‌గ్గ‌రున్న చిన్నపిల్లాడి ఫొటోతో పాటు కామెంట్‌ను జ‌త చేశాడు. ఈ పోస్ట్ చేసిన అభిమానులకు ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు.

కొద్దీ రోజుల క్రితం తన భార్య‌ ను ప‌రిచ‌యం చేస్తూ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు రాహుల్ రామ‌కృష్ణ‌. దీనిపై కొంద‌రు నెటిజ‌న్స్ అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత‌ స‌రేలే ఎలాగూ పెళ్లి చేసుకోబోయే అమ్మాయే క‌దా అని మ‌రికొంద‌రు విషెష్ కూడా చెప్పారు. మ‌రి ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలియ‌దు కానీ.. త‌న భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి ఈరోజు అంద‌రికీ షాకిచ్చారు. ఇక ఇప్పుడు కొడుకు పుట్టాడని తెలిపి మరో షాక్ ఇచ్చాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ..అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఆర్ఆర్ఆర్ స‌హా ప‌లు చిత్రాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టించి న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు.