యూట్యూబ్ లో దూసుకెళ్తున్న వారియర్ బుల్లెట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఈరోజు బుల్లెట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు, హరిప్రియ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాత యూట్యూబ్ లో బుల్లెట్ స్పీడ్ లో వ్యూస్ తో దుకెళ్తుంది.

ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగిన స్టెప్పులతో రామ్ – కృతి శెట్టి చెలరేగిపోయారు. రామ్ మంచి డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఆయనతో పోటీపడుతూ కృతి శెట్టి డాన్స్ చేసిందనే చెప్పాలి. జులై 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.