వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తున్న రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..వెకేషన్‌ను ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తున్నారు. భారత్‌ జోడో యాత్రతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్‌ జోడో యాత్ర లో రాహుల్‌ 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం గుండా సుమారు 4వేలకు పైగా కిలోమీటర్లు నడిచారు. గత సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర.. 75 జిల్లాల్లో 4,080 కిలోమీటర్ల దూరం కొనసాగింది.

ఈ యాత్ర 135 రోజుల పాటు కొనసాగి.. గత నెల 29న కశ్మీర్‌లో యాత్ర ముగిసింది. ప్రస్తుతం రాహుల్ జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో సేదతీరుతున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్‌ వెళ్లిన రాహుల్‌.. మంచుపై స్కీయింగ్‌ చేస్తూ అక్కడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.