నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ..బీజేపీ విమర్శలు

పక్కనున్న మహిళ నేపాల్ లో చైనా అంబాసడర్ అంటున్న కొందరు..వీడియో వైరల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో ఉన్న వీడియో ఇప్పడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో రాహుల్ పక్కన ఒక మహిళ కనిపిస్తున్నారు. డిమ్ లైట్ ఉన్న నైట్‌క్ల‌బ్‌లో ఓ మ‌హిళా ఫ్రెండ్‌తో రాహుల్ ఉన్న‌ట్లు ఆ వీడియోలో ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ మ్యూజిక్‌కు జ‌నం డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. నేపాల్ రాజ‌ధానిలోని ప్ర‌ఖ్యాత నైట్‌క్ల‌బ్‌కు రాహుల్ వెళ్లిన‌ట్లు తె లుస్తోంది. జ‌ర్న‌లిస్టు ఫ్రెండ్ సుమ్నిమా ఉడాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు సోమ‌వారం రాహుల్ ఖాఠ్మాండు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఒక‌వైపు లుక‌లుక‌లుంటే.. మ‌రో వైపు రాహుల్ విదేశీ నైట్ క్ల‌బ్‌ల‌కు వెళ్లార‌ని అమిత్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం ఖాట్మాండు వెళ్లారు. విస్తారా ఎయిర్‌లైన్స్ ఫ్ల‌యిట్‌లో ఆయ‌న 4.40 నిమిషాల‌కు అక్క‌డికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో పాటు ఆయ‌న మిత్రులు.. ఖాట్మాండులోని మారియ‌ట్ హోట‌ల్‌లో బ‌స చేస్తున్నారు. నేపాలీ ఫ్రెండ్ సుమ్నిమా దాస్ పెళ్లికి హాజ‌ర‌య్యేందుకు రాహుల్ వెళ్లారు. సుమ్నిమా తండ్రి బీమ్ ఉదాస్ పంపిన ఆహ్వానం మేర‌కు రాహుల్ పెళ్లికి వెళ్లారు. బీమ్ ఉదాస్ గ‌తంలో మ‌య‌న్మార్‌కు నేపాలీ అంబాసిడ‌ర్‌గా ప‌ని చేశారు.

జ‌ర్న‌లిస్టు సుమ్నిమా గ‌తంలో సీఎన్ఎన్ క‌రస్పాండెంట్‌గా చేశారు. నిమా మార్టిన్ షెర్పాను ఆమె పెళ్లి చేసుకుంటోంది. మంగ‌ళ‌వారం పెళ్లి తంతు నిర్వ‌హిస్తున్నారు. మే 5వ తేదీన రిసెప్ష‌న్ ఉంది. బౌద్ధ‌లో ఉన్న హ‌య్య‌త్ రీజెన్సీ హోట‌ల్‌లో రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి కోసం ఇండియా నుంచి మ‌రికొంత మంది వీవీఐపీలు హాజ‌ర‌య్యారు. 2018లోనూ ఓ సారి రాహుల్ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. టిబెట్‌లోని కైలాస్ మాన‌స‌స‌రోవ‌రం వెళ్లే క్ర‌మంలో ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌చ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/