బిజెపి – కాంగ్రెస్ పార్టీల మధ్య కొత్త రగడ

బిజెపి – కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో ఫై పోటాపోటీగా ఇరు నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. రాహుల్ నేపాల్ లోని చైనా మహిళా దౌత్యవేత్తతో పబ్ లో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బీజేపి, తెరాస పార్టీల నేతలు ఈ వీడియో ఫై మాట్లాడుతూ..వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం బిజెపి నేతల తాలూకా పార్టీ పిక్స్ ను షేర్ చేస్తున్నారు.

రాహుల్ ఖాట్మండులోని మారియట్ హోటల్ లో బస చేసారు. అయితే, రాహుల్ వివాహానికి వ్యక్తిగత టూర్ కు వెళ్లారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యూరప్ వెళ్లిన ప్రధాని ప్రవాస భారతీయులతో మాట్లాడి..యూరప్ దేశాలతో సంబంధాల పైన ఫోకస్ పెట్టారని వివరిస్తున్నారు. కానీ, ఇప్పుడు బీజేపీ నేతలు రాహుల్ వీడియో ట్వట్ చేస్తూ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు.