సత్యసాయి జిల్లాలో ఘోరం : పదో తరగతి పరీక్ష రాస్తుండగా విద్యార్థినిఫై ఊడిపడిన ఫ్యాన్

ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్ష రాస్తుండగా విద్యార్థినిఫై ఫ్యాన్ ఊడిపడి గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థిని యథావిధిగా పరీక్షలు రాసింది.

పరీక్షకు రెండు రోజుల ముందు మెయింటెనెన్స్ చేయించామని స్కూలు ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని, పటిష్ఠ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అంతకుముందు గత నెల 28న కర్నూలు జిల్లా గోనెగండ్లలోని మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ పైకప్పు కూలి ఇద్దరు విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఖంగారుపడుతున్నారు.