కేరళలో చికిత్స తీసుకుంటున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గత కొద్దీ రోజులుగా మోకాలి సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కేరళలో రాహుల్ గాంధీ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. వారం రోజుల పాటు కేరళలోని మలప్పురం జిల్లాలో గల కొట్టక్కల్ ఆర్య వైద్య శాలలో ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నెల 29 వరకు అక్కడే ఉండనున్నారు. రాహుల్ వెంట కేసి వేణుగోపాల్ ఉంటారు.

జోడోయాత్ర సందర్భంగా కాళ్లకు నొప్పులు వచ్చినట్లు గతంలో తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ కూడా చికిత్స నిమిత్తం అక్కడికి వెళ్తారని సమాచారం. గురువారం రాహుల్ గాంధీ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.