విడాకుల ఫై మెగా హీరో క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ – కళ్యాణ్ దేవ్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ మధ్య మెగా ఫంక్షన్లలో ఎక్కడ కూడా కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. దీంతో మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు సైతం ఈ వార్తలు నిజమే అని అనుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ విడాకుల ఫై క్లారిటీ ఇచ్చారు.

భార్య శ్రీజ బర్త్‌డే సందర్భంగా..హ్యాపీ బర్త్‌డే స్వీటూ అంటూ లవ్‌ సింబల్‌ను జతచేస్తూ ఫోటోను పోస్ట్‌ చేశాడు.
దీనికి శ్రీజ ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ట్యాగ్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విడాకుల రూమర్స్‌కి బ్రేక్‌ పడినట్లయ్యింది. 2016లో శ్రీజ-కల్యాణ్‌ల వీరి పెళ్లి జరిగిన సం‍గతి తెలిసిందే. కాగా విజేత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్‌ దేవ్‌ ఇటీవలె సూపర్‌ మచ్చి, కిన్నెరసాని షూటింగ్స్‌ పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.