కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్‌

జీడీపీని అగాధంలోకి నెట్టేశారు..రాహుల్‌

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. మోడి ప్రభుత్వం ప్ర‌ణాళిక‌ల వ‌ల్లే భార‌త జీడీపీ ప‌డిపోయిన‌ట్లు ఆరోపించారు. కరోనాను కేంద్రం సమ‌ర్థంగా ఎదుర్కోలేద‌న్నారు. క‌రోనాపై ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్ల‌.. భార‌త జీడీపీ 24 శాతానికి ప‌డిపోయిన‌ట్లు త‌న ట్వీట్‌లో రాహుల్ ఆరోపించారు. 12 కోట్ల మంది ఉద్యోగాలు కూడా కోల్పోవ‌డానికి కార‌ణం ఇదే అన్నారు. మోడి ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్ల ప్ర‌తి రోజు అత్య‌ధిక స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు రాహుల్ ఆరోపించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి, మీడియాకు మాత్రం అంతా స‌వ్యంగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని రాహుల్ విమ‌ర్శించారు. ప్రపంచంలో అత్యధిక కోవిడ్19 కేసులు నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానానికి త్వరలోనే చేరబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి తన ప్రభుత్వ భావి వ్యూహాలను వివరించాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.

కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో కోవిడ్19 మహమ్మారి, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/