నేడు ఐరాసలో ప్రధాని మోడీ ప్రసంగం

న్యూయార్క్: భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటన కొనసాగున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శనివారం న్యూయార్క్‌ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఐరాస సాధారణ సమావేశం వర్చువల్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. ‘న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్‌ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను’ అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

కాగా, ప్రధాని మోడీ అంతకుముందు వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలు, ఆఫ్ఘనిస్థాన్‌ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితలుపై చర్చించారు. అనంతరం క్వాడ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులు స్కాట్ మారిసన్​, యొషిహిదే సుగాలు హాజరయ్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/