వికారాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన కెసిఆర్‌

YouTube video
CM Sri. KCR Inaugurating Integrated District Offices Complex at Vikarabad District

వికారాబాద్‌ః ముఖ్యమంత్రి కెసిఆర్‌ వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నేటి సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేప‌ట్టారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, కాలే యాద‌య్య‌, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుర‌భి వాణిదేవి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/