ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన నందమూరి బాలకృష్ణ

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సినీ నటుడు , హిందూపురం టీడీపీ మ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ‘మత గురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనురిస్తూ నెలరోజులు ఉపావాస దీక్ష పూర్తి చేసుకున్న ముస్లింలకు నా సలాం. ఓ వైపు ఆధ్యాత్మికత, మరవైపు సర్వ మానవ సమానత్వాన్ని, సేవా భావాన్ని చాటి చెప్పేదే రంజాన్.
ఈ రంజన్ పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేవుడు మన అందరికీ మంచి భవిష్యత్తు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు. సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.