సెక్స్ కంటే ఫుడ్ ముఖ్యం అంటున్న శృతి హాసన్

సెక్స్ కంటే ఫుడ్ ముఖ్యం స్టేట్మెంట్ ఇచ్చిన కమల్ కూతురు శృతి హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా గ్రాండ్ గా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో ఆమె జతకమే మారిపోయింది. ఈ మూవీ తర్వాత అమ్మడు వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్ల తో దూసుకెళ్తుంది. కేవలం సినిమాల పరంగానే కాక ప్రేమ వ్యవహారాలతోను అమ్మడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె ప్రేమ వ్యవహారం పక్కన పెడితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా లో సెక్స్ ముఖ్యంగా ఫుడ్ ముఖ్యమా అని ప్రశ్నించగా..తన దృష్టిలో సెక్స్ కంటే ఆహారమే ముఖ్యం అని చెప్పుకొచ్చింది.

సెక్స్-ఫుడ్ ను కంపార్ చేయడమే తప్పు. భోజనం లేకుండా ఎవరైనా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? సెక్స్ లేకపోతే చచ్చిపోం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే.. సెక్స్ కంటే ఫుడ్ చాలా ముఖ్యం అని తెలిపింది. అలాగే పెళ్లి ఫై కూడా నోరు విప్పింది. నిజం చెప్పాలంటే జీవితంలో నేను పెళ్లి చేసుకోను. అయినా ఇప్పుడది ముఖ్యం కాదు. 2021లో చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. చాలా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. నా పెళ్లి అస్సలు టాపిక్ కానే కాదు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది.