భీమవరంలో పవన్ కళ్యాణ్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం -RRR

వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ..నిన్న భీమవరం లో వైసీపీ అధినేత , సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఫై రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని , మహిళలను అట వస్తువుల్లాగా చూస్తారని , మూడేళ్లకు , నాలుగేళ్లకోసారి భార్యలను మార్చడం పవన్ కళ్యాణ్ కు అలవాటు అంటూ సంచలన కామెంట్స్ చేసారు జగన్. ఈ కామెంట్స్ ఫై రఘురామ స్పందించారు.

పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లకు, ఓట్లకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఆయన భావ దారిద్ర్యాన్ని, దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోందని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని నరసాపురం ఎంపీగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా తాను ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నానని అన్నారు. తాను గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నానని, పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరుపాళ్ళు భీమవరం లో 50 వేల మెజార్టీ తో గెలుస్తారని పేర్కొన్నారు.