ముందుగానే వచ్చేస్తున్న ‘‘విరాటపర్వం’’

‘విరాటపర్వం’..దగ్గుపాటి రానా , సాయి పల్లవి , ప్రియమణి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల డైరెక్షన్లో తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితమైంది. ఓటిటిలలో రిలీజ్ అవుతుందని పలుమార్లు వార్తలు వినిపించినప్పటికీ మేకర్స్ మాత్రం థియేటర్స్ లలోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించి హమ్మయ్య అనిపించారు.

ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త రిలీజ్ వీడియోను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో రాబోతుండగా, రానా దగ్గుబాటి ఇందులో ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్త దితరులు నటిస్తుండగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.