జిమ్ లో సమంత ఎంత కష్టపడుతుందో..

క్రేజీ బ్యూటీ సమంత జిమ్ లో తెగ కష్టపడుతుంది..దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. కెరియర్ మొదట్లో వరుస సినిమాలు చేసిన సామ్..ఆ తర్వాత చైతు ను పెళ్లి చేసుకోవడం..కొంతకాలానికే విడాకులు తీసుకోవడం ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ తర్వాత ఆమె మయోసైటిస్ గురవ్వడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఈ వ్యాధి నుండి ఆమె కోలుకోవాలని అభిమానులు , సినీ ప్రముఖులు కోరుకున్నారు.

ఈ మధ్యనే మళ్లీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది..అలాగే నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో సామ్ ఓ పోస్టు పెట్టారు. జిమ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఇందులో సమంత హాట్ అందాలు కనిపించాయి.