రాజ్‌నాథ్‌సింగ్‌తో రఘురామకృష్ణరాజు భేటి

వైఎస్‌ఆర్‌సిపి ఇచ్చిన షోకాజు నోటీసుపై కీలక చర్చలు

raghurama-krishnam-raju meet-rajnath singh

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఆయన ఈరోజు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈక్రమంలోనే ఆయన షోకాజ్‌ నోటీసుపై చర్చిస్తున్నారు. తనకు వైఎస్‌ఆర్‌సిపి జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని, దానిపై సిఎం జగన్‌ జగన్‌ సంతకం లేదని ఆయన అంటున్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసంపై ఉన్నట్లు ఆయన నిన్న ఈసీకి కూడా వివరించారు. తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని, తనపై చర్యలు ఎలా తీసుకుంటారాని ఆయన వాదిస్తున్నారు. కాగా రఘురామకృష్ణం రాజు నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిసిన విషయం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/