సౌదీలో ఒక్కరోజే 3,938 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 1,74,577

Coronavirus- Saudi Arabia

రియాద్‌: సౌదీ అరేబియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్ర‌‌వారం 3,938 కొత్త కేసులు న‌మోదయిన‌ట్లు సౌదీ ఆరోగ్య‌శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బారిన ప‌డిన వారి సంఖ్య 1,74,577కు చేరింది. మ‌రో 2,589 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కావ‌డంతో మొత్తం కోలుకున్న‌వారు 1,20,471 మంది అయ్యారు. కాగా, శుక్ర‌‌వారం సంభ‌వించిన 46 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఆ దేశంలో ఈ వైర‌స్‌తో చ‌నిపోయిన వారి సంఖ్య 1,474కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా 52,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 2,273 కేసులు క్రిటిక‌ల్ స్టేజ్‌లో ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/