తైవాన్‌లో హెలికాప్టర్‌ ప్రమాదం..దేశ సైన్యాధిపతి గల్లంతు

తైపీ నుంచి బయలుదేరిన చాపర్. కాసేపటికే సమీపంలోని పర్వతంపై కూలిన హెలికాప్టర్

Shen Yi-ming
Shen Yi-ming

తైపీ: తైవాన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరుగగా, ఆ దేశ సైన్యాధిపతి షెన్ ఈ మింగ్ అదృశ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. రాజధాని తైపీ సమీపంలోనే ఉన్న ఓ పర్వతంపై హెలికాప్టర్ కూలిపోగా, సహాయక బృందాలు హుటాహుటిన తరలి వెళ్లాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఈశాన్య ఇలాన్ కౌంటీ సమీపంలో విధులను నిర్వహిస్తున్న సైనికులను పరామర్శించేందుకు షెన్ ఈ మింగ్ బయలుదేరారు. ఆయనతో పాటు మరో 13 మంది కూడా ఉన్నారు. యూహెచ్ 60 ఎం హెలికాప్టర్ రకానికి చెందిన చాపర్, టేకాఫ్ తీసుకున్న కాసేపటికే చాపర్ అదృశ్యమైంది. ఈ ఘటనలో పది మంది వరకూ ప్రాణాలతో బయట పడినట్టు తెలుస్తుండగా, షెన్ ఈ మింగ్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. 62 సంవత్సరాల వయసున్న ఆయన, ప్రస్తుతం చీఫ్ ఆఫ్ మిలిటరీ స్టాఫ్ గా విధుల్లో ఉన్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు జరుపుతున్నామని తైవాన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/