కాంతారా మూవీ ఓటిటిలోకి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే..

కాంతారా మూవీ కోసం ఓటిటి ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి చూపులకు మాత్రం తెరపడడం లేదు. వారం కితం రిలీజ్ అయినా సినిమాలు ఓటిటి లో ప్రసారం అవుతున్నాయి కానీ , నెల రోజుల క్రితం రిలీజ్ అయినా కాంతారా మాత్రం ఇంకా స్ట్రీమింగ్ కావడం లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల ఆరంభం నుంచే ఈ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కావాల్సి ఉండే కానీ థియేటర్లలో ఇప్పటికీ మూవీ రన్ అవుతుండటంతో అది కాస్త వాయిదా పడింది.

కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకుంది. దాంతో మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ మూవీ దాదాపు రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే ప్రధాని మోడీ కూడా ఈ సినిమాని చూడబోతున్నారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు ఈ మూవీని చూసి ప్రశంసించారు. వాస్తవానికి ఈ నెల ఆరంభంలోనే కాంతార మూవీ ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ.. ఇప్పటికీ అన్ని భాషల్లోనూ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ఈ మూవీ కొనసాగుతోంది. దాంతో చిత్ర యూనిట్ పునాలోచనలో పడిపోయింది. హొంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీని భారీ ధరకి అమెజాన్ ప్రైమ్ అక్టోబరులోనే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ నెల ఆరంభం నుంచే ఆ ప్లాట్‌ఫామ్‌లో కాంతార మూవీ స్ట్రీమ్ కావాల్సి ఉంది. కానీ థియేటర్లలో ఇప్పటికీ మూవీ రన్ అవుతుండటంతో ఈ నెల 18 వరకు ఆగాలని కాంతార ప్రొడ్యూసర్ కోరినట్లు తెలుస్తోంది. దానికి అమెజాన్ కూడా అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిబట్టి చూస్తే ఈ నెల 18 నుండి అమెజాన్ లో కాంతారా స్ట్రీమింగ్ కాబోతుందన్నమాట.