సిఎం జగన్‌కు ఎంపి రఘురామకృష్ణంరాజు లేఖ

YSRCP MP Raghurama Krishnam Raju

అమరావతి: షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయంపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి రఘురామ కృష్ణరాజు సిఎం జగన్‌కు లేఖ రాశారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి పార్టీ పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని అన్నారు. పలు సందర్భాల్లో ఈసీ తమ పార్టీకి రాసిన లేఖలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఏ సందర్భంలోనూ వైఎస్‌ఆర్‌సిపి అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పిందని ఆయన తెలిపారు. తాను వెంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడినినని చెప్పారు. +స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. ఆస్తుల అమ్మకం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మాత్రమే చెప్పానని అన్నారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. జగన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/