అర్జునుడు కోడికత్తి డ్రామా ఆడలేదు- జగన్ కు జనసేన కౌంటర్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం మొదలుపెట్టాయి. ఓ పక్క అభ్యర్థుల ఎంపిక చేస్తూనే..మరోపక్క అధినేతలు ప్రజల్లోకి వెళ్తూ ఓటర్లను గడ్డారా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు రా.,.కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇక శనివారం వైసీపీ అధినేత , సీఎం జగన్ సైతం భీమిలి వేదికగా సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా టీడీపీ , జనసేన , కాంగ్రెస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. దుష్టచతుష్టయాన్ని.. గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా?. వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. మన టార్గెట్ 175 కు 175 అసెంబ్లీ, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని సీఎం పేర్కొన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే. మరో 25 ఏళ్ల పాటు మన జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

తాను అభిమన్యుడిని కాదు అర్జునుడినన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు జనసేన శతఘ్ని టీమ్ కౌంటర్ ఇచ్చింది. ‘అర్జునుడు బాబాయిని లేపేసి సింపతీ రాజకీయం చేయలేదు. కోడికత్తి డ్రామా ఆడలేదు. అయ్య చనిపోయాడు నన్ను గెలిపించండి అని యుద్ధభూమిలో అడుక్కోలేదు. ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపించండి అని ప్రాధేయ పడలేదు. నువ్వేంటో ఈ పాటికే ఒక ఐడియా వచ్చి ఉంటది జగన్’ అని ట్వీట్ చేసింది.