రేపు ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ నామినేషన్

\ఉండి నియోజకవర్గ TDP MLA అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు రేపు (సోమవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి MRO ఆఫీసులో రేపు ఉ.10.30 గంటలకు తాను నామినేషన్ వేస్తానని RRR ట్వీట్ చేశారు. ఇందుకోసం పెదఅమిరంలోని స్వగృహం నుంచి భారీ ర్యాలీగా MRO ఆఫీసుకు బయల్దేరనున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని RRR కోరారు. కాగా తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ MLA రామరాజుకు కేటాయించిన CBN.. చివరకు RRRకు ఫైనల్ చేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజుని స్వయంగా కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణంరాజు.