కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థితి విషమం!
నెల్లూరు: సినీ నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. కొద్దిసేపటి క్రితం మహేశ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్నారు. చెన్నైకి తరలించే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో కత్తి మహేశ్ తలకి తీవ్రగాయాలయినట్లు సమాచారం.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/