గంజాయి సరఫరాను కూడా నియంత్రించలేని వారికి పదవి అవసరమా అంటూ రఘురామ ఫైర్

వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి జగన్ ఫై విరుచుకపడ్డారు. గంజాయి సరఫరాను కూడా నియంత్రించలేని వారికి పదవి అవసరమా అంటూ ప్రశ్నించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ నుంచే వచ్చిందని అంటున్నారని… తమ పార్టీ వాళ్లే గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్పుకుంటున్నారని రఘురామ అన్నారు. తనకు ఆరు నెలలు హోంమంత్రి పదవి ఇస్తే తానేంటో చూపిస్తానని… గంజాయి అనే మాటే వినపడకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

తనపై కేసులు లేవని జగన్ అంటున్నారని… కానీ, ఎన్నికల అఫిడవిట్ లో కేసులు ఉన్నట్టు పేర్కొన్నారని అన్నారు. ఆర్థిక బలం, అంగ బలం లేదని చెప్పారని… దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ అని చెప్పారు. ఈ నాలుగేళ్లలో లిక్కర్, ఇసుక, మట్టిలో ఎంతో వెనుకేశారని ఆరోపించారు. అంబానీ, అదానీ తర్వాత దేశంలో జగనే సంపన్నుడు అని ప్రజలు అనుకుంటున్నారని రఘురామ అన్నారు.