గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల పెరిగాయిః వార్షిక నేర నివేదిక విడుదల

rachakonda-annual-crime-report-released

హైదరాబాద్‌ః గత ఏడాదితో పోలిస్తే 6.8% పెరిగిన నేరాల సంఖ్య పెరిగినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. ఈ ఏడాది 29166 కేసులు నమోదు అయిందని.. గతేడాది 27664 కేసులు నమోదు అయిందని చెప్పారు. ఇక తెలంగాణలో 633 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఏడాది 633 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ప్రకటించారు.

లోక్ అధాలత్ లో కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో రాచకొండ కమిషనరేట్ ఉందన్నారు. ఈరోజు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఇయర్‌ ఎండింగ్‌ కేసుల వివరాలు ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు చేశామని… 2900 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయిందన్నారు.

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి…. ఈ ఏడాది 3321 ప్రమాదాల్లో 633 మంది మృతి చెందినట్లు చెప్పారు. 3205 మందికి గాయాలు అయ్యాయన్నారు. గతేడాది తో పోలిస్తే 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని చెప్పారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా, ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను అరెస్ట్ చేశాం, 71 మంది బాధితులకు విముక్తి కలిగించామన్నారు.