బిజెపి లోకి మాజీ ఎమ్మెల్యే మొగులూరి భిక్షపతి..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని బిజెపి వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా వరుస పెట్టి ఇతర పార్టీలకు చెందిన నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలువురు టిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలను చేర్చుకోగా..తాజాగా పరకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మొగులూరి భిక్షపతి బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యాడు.

ఈ నెల 9న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు , ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో మొగులూరి భిక్షపతి చేరనున్నారు. అలాగే నర్సాపూర్ టిఆర్ఎస్ సీనియర్ లీడర్ మురళి యాదవ్ సైతం చేరనున్నారు. భిక్షపతితో ఫోన్ లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్… 9వ తేదీన పార్టీలో చేరమని కోరినట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై భిక్షపతి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు భిక్షపతి స్పష్టం చేశారు.