ఈ ఘటన వెనుక బాబు హస్తం ఉంది

రాజకీయ దుమారం రేపుతున్న అంతర్వేది ఘటన

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: అంతర్వేది ఘటనపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..అంతర్వేది రథం దగ్ధం ఘటనలో హైదరాబాదు, గుంటూరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేత బాబు, ఆయన అనుచరగణం కుట్ర ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక పెదబాబు, చినబాబు హస్తం ఉందన్న విషయం విచారణలో బయటపడుతుందని తెలిపారు. బాబు హైదరాబాదులో ఉంటూ ఏపిలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ట్విట్టర్ లోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రం… మళ్లీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? అంటూ విమర్శించారు. సిఎం జగన్ శ్రీకారం చుట్టిన వైఎస్సార్ ఆసరా నుంచి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కాదా అని నిలదీశారు. కానీ మీ కుట్ర విఫలం… వైఎస్సార్ ఆసరా సఫలం అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ వినండి… మాట నిలబెట్టుకుంటూ సిఎం జగన్ తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశారని వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/