భారతదేశపు ఠీవి.. మన పివి

బహుముఖ ప్రజ్ఞాశాలి

PV Narasimha rao -File
PV Narasimha rao -File

భారత జాతిరత్నం పి.వి శతజయంతోత్సవాలను అవని ఎల్లెడలా చాటిచెప్పెలా సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం మరుగునపడిన, మరుగుపర్చబడిన పి.వి ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి తెలియపర చడమేకాక తెలుగువారి ఆత్మగౌర వాన్ని, గొప్పదనాన్ని, సమున్నతంగా నిలబెట్టడమే.

కొందరు రాజకీయ లాభాన్ని ఆశిస్తున్నారనే కోణంలా చూసిన, అధిక సంఖ్యాకుల దృష్టిలో తప్పనిసరిగా చేయాల్సిన ఒక ఉత్తమ కార్యాచరణ, చరిత్రపుటల్లో తనకంటు ఒక పేజీని లిఖించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పాములపర్తి వేంకట నరసింహారావు.

ఆయన గొప్ప దార్శనికుడైన, తాత్వికుడైన, పాలకులు. గొప్ప కవి,రచయిత, జర్నలిస్టు.17ఏళ్ల వయసులో నిజాంను ఎదరించి వందేమాతరం పాడిన ధైర్యశాలి.

ఎల్‌ఎల్‌బి పూర్తి చేసినా, కాక తీయ పత్రికను స్థాపించి జర్నలిస్టుగానే ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనేక పత్రికలకు వ్యాసాలు రాశారు.

17దేశ విదేశీ భాషలు, కోబాల్‌, బేసిక్‌, యూనిక్స్‌ వంటి కంప్యూటర్‌ భాషలు ఆయన విషయగ్రహశక్తిని వెల్లడిస్తాయి.

విశ్వనాథ వారి కాళిదాసును సహస్రఫణ్‌ పేరుతో హిందీలోకి అనువదించినందు కు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్న ఏకైక ప్రధాని పి.వి. నరసింహారావు గొప్పసామ్యవాది.

లక్నెపల్లిలో జన్మించి వంగరకు దత్తత వెళ్లగా వారసత్వంగా వచ్చిన వందల ఎకరాల భూములను పేదప్రజలకు పంచిపెట్టిన మానవతామూర్తి.

దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తెచ్చి విదేశీపెట్టుబడికి తలుపులు బార్లాతెరిచినా, పేద ప్రజల సంక్షేమ కోణాన్ని ఆయన విస్మరించలేదు. విద్య, వైద్య రంగాలు, కార్మిక సంస్కరణల విషయంలో దేశానుకూల సంస్కరణలకు ఆయన రూప కల్పనచేశారు.

స్వామి రామా నందతీర్థ,బూర్గుల రామకృష్ణా రావ్ఞ అనుయాయిగా ఉండి కాంగ్రెస్‌లో చేరిన పి.వి 2004లో తుదిశ్వాస విడిచేవరకు కరడుకట్టిన కాంగ్రెస్‌ వాదిగా జీవించారు.ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాల్గవ ముఖ్యమంత్రిగా, కేంద్రస్థాయిలో హోం, రక్షణ, విదేశీ మానవ వనరులశాఖ మంత్రిగా వివిధ స్థాయిలలో పనిచేసి సమర్థత నిరూపించుకున్నారు పి.వి.

ఎన్నికల ప్రచారసమయంలో 1991లో రాజీవ్‌గాంధీ మరణించడంతోవివాదరహితుడు, గ్రూపిజం లేని వ్యక్తి, కాంగ్రెస్‌ విధేయుడు, మేధావిగా గుర్తింపు పొందిన పి.విని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపిక చేసింది.

1991 నుంచి 1996, 9వ ప్రధానిగా పనిచేసిన పి.వి ఎల్‌పిజి సంస్కరణలు తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి బాటలు వేశా రు.పి.వికి ముందు పనిచేసిన చంద్రశేఖర్‌ కాలంలో ఆర్థికవ్యవస్థ దివాలా తీసి, చెల్లింపులు చేయలేక రెండువారాలపాటు దేశం డీఫాల్ట్‌ అయింది.

విదేశీ మారకద్రవ్యం కోసం 47టన్నుల బంగా రాన్ని లండన్‌ కేంద్ర బ్యాంకువద్ద తనఖా పెట్టాల్సివచ్చింది. ఇటువంటి గడ్డుకాలంలో ప్రధానిగా తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను ఆర్థికసంస్కరణలు తేవాల్సి వచ్చిందని పి.వి పేర్కొన్నా రు. పి.వి నెహ్రూ, గాంధీ కుటుంబానికి వెలుపల ఐదేళ్లపాటు ఏలిన తొలివ్యక్తి పి.వినే.

1991లో ప్రారంభించిన కొత్త ఆర్థిక విధానంలో పలు సంస్కరణలుతెచ్చారు.రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్‌సింగ్‌ను దేశ ఆర్థికమంత్రిగా నియ మించడమే ఆయన స్వతంత్రతకు ఉదాహరణ. కాంగ్రెస్‌లోని ముఠాతత్వం,ప్రధాని పదవిని ఆశించిన నాయకుల కుట్రల వల్ల సోనియాకు, పి.వికి మధ్య అఘాధం పెరిగింది.

తత్ఫలితంగానే మరణాంతరం పివికి కాంగ్రెస్‌, సోనియా కాంగ్రెస్‌ విధేయులు సరైన గౌరవం ఇవ్వలేదు. పార్ధీవ దేహాన్ని ఎఐసిసి కార్యాలయం లోకి రానివ్వకపోవడం,ఢిల్లీకి బదులు తొలిసారిగా ఒకదేశ ప్రధా నికి బయట అంతిమసంస్కారాలు చేయడం,ఢిల్లీలోస్మృతిచిహ్నం నిర్మించకపోవడం,పివి భారతరత్న ఇవ్వకపోవడం ఇలాంటి ప్రతికార చర్యలకు పాల్పడ్డారు.

దేశ ప్రగతికి బాటలు వేసిన తెలుగు తేజం మన పివి. ఆయన ఒక మౌనముని, సరస్వతీ పుత్రుడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని ఆయన నిరూపించారు.

  • తండ ప్రభాకర్‌గౌడ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/