కూలీలకు తగ్గుతున్న ‘ఉపాధి’

Declining 'employment' for wages
Declining ’employment’ for wages

పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ పథకంగా ప్రచార్భాటాలను అందుకుంటున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ కూలీలకు ఊతం ఇవ్వలేకపోతోంది. ఉపాధి పథకం పనులు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికను సమర్థంగా అమలు చేయకపోవడంతో పేద కుటుంబాలకు పని కల్పించడం కూడా క్రమంగా తగ్గిపోతోంది.

పేద కుటుంబాలకు ఏడాదిలో కనీసం వంద రోజులు పని కల్పించే ఉద్ధేశంతోనే కేంద్రం అమలు చేస్తున్న పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఎపిలో సగటున రోజువారీ వేతనం రూ.150తో ప్రారంభమవ్వగా, నేడు అది రూ. 211కు పెరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో సగటు వేతనం రూ. 350 నుంచి రూ. 500వరకు ఉండగా, ఉపాధి పథకంలో నేటికీ రూ. 211 వేతనం చెల్లిస్తుండటం గమనార్హం. ఒకవైపున ఏటా నిత్యావసర వస్తువ్ఞల ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఉపాధి వేతనాలలో మాత్రం అత్యల్పంగానే పెరుగుదల ఉంటోంది.

విపరీతంగా పెరిగిన జీవన వ్యయం కారణంగా ఒకవైపు పని దినాలు 200కు, రోజువారీ వేతనాన్ని రూ. 500లకు పెంచాలనే డిమాండు ఉండగా, వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాల నిర్వహణ కోసం బడ్జెట్‌ కేటాయింపుల్లో కోత విధిస్తుండటం గమనార్హం. ఏడాదిలో సగటున రోజువారీ వేతనం ఒక్కసారిగా రూ. 89.70, గ్రామీణులకు పనిదినాలు సగటున 101 మాత్రమే లభిస్తున్నాయి. ఈ పథకం అమలులో కేరళ అగ్రస్థానంలో ఉండగా పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే తెలుగు రాష్ట్రాలు 10,12 స్థానాలలో ఉన్నాయన్న జాతీయ సంక్షేమపథకాల పర్యవేక్షణసంస్థ తన తాజానివేదికలోతెలిపింది.

ఉదయం ఆరు గంటలకే ఉపాధిపనులకు వెళ్లికూలీలు నాలుగైదు గంటలపాటు ఎండలో కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడా క్రమంగా తగ్గుతుండటంతో ఆ మేర పనులను తగ్గించేస్తున్నారు.పథకం లక్ష్యం ప్రకారం అర్హులైన ఉపాధి కార్మికులకు వందరోజులపాటు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.కేంద్రం నిధులు కేటాయించినా, వాటిలో 60శాతం నిధులను మాత్రం ఖర్చు చేసి మిగతా నిధులను ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నట్లు సదరు నివేదికలో బయటపడటం దురదృష్టకరం.

  • సి.హెచ్‌.ప్రతాప్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/