తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?

మన రాజ్యాంగం ప్రతి విషయంలో దేశక్షేమాన్ని ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకొని అనేకమైన నియమ నిబంధనలు రూపొందించింది. అయితే ఎంత పకడ్బందీగా రాజ్యాంగ రూపకల్పన జరిగినా ఆయా వ్యవస్థల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని, రాజ్యాంగ మౌలికస్వరూపం దెబ్బతినేలా వ్యూహరచనలు జరుగుతుండడం బాధాకరం.

Delhi Accident
Delhi Accident

ఇప్పటికే మన రాజ్యాంగానికి ఎన్నో సవరణలు జరిగాయి. కాలానుగుణంగా సవరణలు తప్పని సరి. అయితే రాజకీయ కారణాలతో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించడం తగదు. ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లపాత్ర, శాసన వ్యవస్థలో స్పీకర్ల పాత్ర వివాదాస్పదమవ్ఞతున్నది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావ్ఞగా ఉండకపోవడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటున్నది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియ పరిహాసప్రాయంగా మారుతున్నది.

అనునిత్యం దేశంలో ఏదో ఒక రూపంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం రామజన్మభూమి వివాదం, మరి కొంతకాలం మండల్‌ కమిషన్‌ వివాదం, కొంతకాలం ప్రాంతాల పేరుతో, ఆహారం పేరుతో, ఇంకొంతకాలం సంస్కృతి పేరుతో, ఇప్పుడు పౌరసత్వం పేరుతో ఇలా దేశంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మనం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం, రాజ్యాంగ స్ఫూర్తిని వదిలేస్తున్నాం. అయితే రాజ్యాంగ రక్షణ అనేది ప్రజల కంటే పాలకుల భుజస్కంధాలపైనే అధికంగా ఉంది. విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, భాషలతో విరాజిల్లుతున్న భారతదేశాన్ని పాలించడం సులభమైన విషయంకాదు.

జనాభాపరంగా ప్రపంచంలో రెండవస్థానంలో ఉండి, ఎన్నో రకాల వైరుధ్యాలు అగుపించే సువిశాలమైన భారతదేశాన్ని సమైక్యంగా ఉంచుతూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది.రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం భారతదేశానికొక పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడం, రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్య్రానికి పూర్వం నుంచే పురుడు పోసుకుంది.

రాజ్యాంగ రచన కోసం ఎంతో మంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వీరిలో అంబేద్కర్‌ అగ్రగణ్యుడు. అంబేద్కర్‌ ఆలోచనలే రాజ్యాంగ రూపకల్పనలో ప్రముఖపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. బ్రిటన్‌, అమెరికా, రష్యా, కెనడా, ఐర్లాండ్‌, జర్మనీ లాంటి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి తీవ్రకసరత్తు జరిపి రాజ్యాంగ పరిషత్‌ ఆయా దేశాల రాజ్యాంగాలలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.

సుమారు మూడు సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా ఎట్టకేలకు భారతదేశానికొక పటిష్టమైన రాజ్యాంగం రూపొందించడం జరిగింది. మనది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించిన భారత రాజ్యాంగంలో కార్య నిర్వాహక వ్యవస్థ, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ పటిష్టమైన యంత్రాంగాలు. ఇందులో ఏ వ్యవస్థ పనిచేయకపోయినా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవ్ఞతుంది. భారత ప్రజాస్వామ్య మనుగడకు ఈ మూడు వ్యవస్థలు మూడు స్తంభాల వంటివి. మీడియా నాలుగో స్తంభం లాంటిది.

భారత పౌరులకు ప్రాథమిక హక్కులతోపాటు ప్రాథమిక బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి. భారతదేశంలోని పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉండదు. సమానత్వం, స్వేచ్ఛ స్వాతంత్య్రం, మతస్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకమైన హక్కులు, విద్యా, సాంస్కృతిక హక్కు. రాజ్యాంగపరమైన పరిహారపు హక్కులతో పాటు, ప్రాథమిక విధులు కూడా పౌరులకు ఇవ్వబడ్డాయి.

భారతదేశ సార్వభౌమత్వ పరిరక్షణకు, సమైక్యతకు పాటుపడాలని, దేశ భద్రత విషయంలో ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతను విస్మరించరాదని, శాంతి సామరస్యాలను కాపాడుతూ శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలి, భారతదేశానికి సిరిసంపదలైన నదులు, సరస్సులను కాపాడుతూ వన్యప్రాణి సంరక్షణకు కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యమని రాజ్యాంగం నిర్దేశించింది. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడమంటే దేశాన్ని గౌరవించడమేనన్న భావన ప్రతి పౌరుని ప్రాథమిక విధి.

మన రాజ్యాంగం ప్రతి విషయంలో దేశక్షేమాన్ని ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకొని అనేకమైన నియమ నిబంధనలు రూపొందించింది. అయితే ఎంత పకడ్బందీగా రాజ్యాంగ రూపకల్పన జరిగినా ఆయా వ్యవస్థల్లోని లొసుగులను ఆధారంగా చేసుకొని, రాజ్యాంగ మౌలికస్వరూపం దెబ్బతినేలా వ్యూహరచనలు జరుగుతుండడం బాధాకరం. ఇప్పటికే మన రాజ్యాంగానికి ఎన్నో సవరణలు జరిగాయి. కాలానుగుణంగా సవరణలు తప్పని సరి.

అయితే రాజకీయ కారణాలతో రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించడం తగదు. ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లపాత్ర, శాసన వ్యవస్థలో స్పీకర్ల పాత్ర వివాదాస్పదమవ్ఞతున్నది. కేంద్ర,రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావ్ఞగా ఉండకపోవడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటున్నది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియ పరిహాసప్రాయంగా మారుతున్నది.

ఎన్నికల్లో అంగబలం, అర్థబలంతో పాటు మద్యం ఏరులై ప్రవహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ధనప్రభావం వలన ఎంతో మంది అర్హులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అశక్తులుగా మిగిలిపోతున్నారు. కుల, మత, ప్రాంతాలు, భాషా విబేధాలు ఓటర్లను శాసిస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. ఎన్నికల సంఘం ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్టవేయాలి. టి.ఎన్‌.శేషన్‌లా ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించబడుతుంది. ప్రజాస్వామ్యం పరిహాసప్రాయంగా మారితే ఈ తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/