ప్రభుత్వ శాఖల ప్రక్షాళన అవసరం

వ్యవస్థను సంస్కరించే తరుణమిది

Government departments
Government departments

ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధాన రూపకల్పన అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలలో అధికశాతం నిరక్షరాస్యులు గా ఆర్థికంగా సామాజికంగా వెనుక బడి ఉండటం వలన వీరు ప్రభుత్వ పాలనపై చాలా ఆకాంక్షలు పెట్టుకుం టారు.

చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాధనం పట్ల నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉండటమే కాక వారిలో అంకితభావం సేవా తత్పురత శ్రద్ధ కనబడటం లేదని విమర్శలు అనాదిగా వస్తూనే ఉన్నాయి.

కొద్దిమంది ఉద్యోగుల అనైతిక ప్రవర్తన కారణంగా నిధులు దుర్వినియోగం బంధుప్రీతి ఆశ్రిత జనపక్షపాతం ప్రభుత్వ రహస్యాలను బహిర్గతపర్చడం తమ బంధువులకు లేదా స్నేహితు లకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమ అధికారాలను ఉపయో గించడం మొదలైన పరిస్థితులు పాలనలో చోటు చేసుకున్న ఫలి తంగా ప్రజలలో ప్రభుత్వపాలన పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.

1970 తరువాత ప్రభుత్వ ఉద్యోగులలో అవినీతి అనైతిక ప్రవర్తన పెరిగింది. రాజకీయ నాయకుల వ్యాపార వర్గాల కలయిక ఫలి తంగా పాలనా అధికారులు యంత్రాంగం ఉద్యోగుల ప్రవర్తన దృక్పథంపై తీవ్ర ప్రభావాన్ని చూపడానికి దారితీసింది.

ప్రభుత్వ పాలనలో సంస్కరణలను తీసుకురావడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వా లనే వివిధ సంఘాలను కమిటీలను నియమించడం జరిగింది.

గోపాలస్వామి అయ్యంగార్‌ కమిటీ (1949) గోర్యాల కమిటీ (1951) పాల్‌ అపిల్‌బీ కమిటీ (1953,1956) సంతానం కమిటీ (1964) పాలనా సంస్కరణల సంఘం (1966) ఎల్‌.కె.జాల్‌ కమిటీ (1981) మొదలైన కమిటీలు చేసిన సిఫారసులు చిత్తశుద్ధి లోపం కారణంగా అనేక ముఖ్య సూచనలను అమలు పర్చలేకపో యారు.

డెబ్బయి ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో పరిపాలన పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఇంతవరకు ప్రయత్నాలు జరగలేదు. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షో భాలకు అనర్థాలకు ప్రభుత్వ వ్యవస్థ లోపాలే కారణం అని చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రైవేటీకరణకు ప్రజలు ఆకర్షితు లయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రజలు కట్టే పన్నులలో నుండి జీతభత్యాలు పొందే ఉద్యోగులు ఆ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నాలు ఏనాడూ చేయకపోవడం, ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే రిటైర్‌మెంట్‌ వరకు తమరిని ఎవరూ ఏమీ చేయలేరన్న భావన రాజ్యాంగ రక్షణలు సగటు ప్రభుత్వ ఉద్యోగి లో అతి విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

ప్రజలకు దాపరికం లేకుండా సామాన్యులకు అందుబాటులో జవాబుదారీగా ఉండా ల్సిన పాలన అవినీతి రహస్య ఒప్పందాలకి, ఏకపక్ష నిర్ణయాలకి, అక్రమ సంపాదనలకు కారణం అవ్ఞతుంది.

కేవలం ఉద్యోగులే కాదు కొందరు వ్యక్తులు తమ పనుల కోసం అడ్డదారిలో అవలంబించే దుర్వినియోగ పద్ధతులు కూడా కారణం. పారదర్శక పాలన ఒక నినాదనంగానే మారిపోయింది.

ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యక్షంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలు రెవెన్యూ,పోలీస్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ కమర్షియల్‌ టాక్స్‌ రవాణా తదితర విభాగాల్లో అవినీతి గురించి ప్రతిరోజు కథనాలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అవినీతి నిరోధక శాఖలు, సి.బి.ఐ లాంటి సంస్థలలో కూడా అవినీతి వాసనలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.ఏ మాత్రం రాజకీయ అండలేని చిరు ఉద్యోగులపైనా దాడులు జరుగుతున్నాయని, పెద్ద తిమింగ లాలు తప్పించుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకొని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కొందరు అధికారులు రాజకీయ అండతో అతికొద్ది కాలంలోనే మళ్లీ పోస్టింగ్‌లోకి వస్తున్నారు.

ఏ అండా లేని ఉద్యోగులు అల్లాడిపోతున్నారు.ఈ విషయంలో నిబంధనల సవరణ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, అకుంఠిత దీక్ష పరిపూర్ణ మైన నిష్పాక్షికత అంకితభావంతో పనిచేసినప్పుడే పేదలసంక్షేమం కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న లక్షలాది కోట్ల ప్రజాధనం ఉపయో గపడుతుంది.

రాజకీయ చిత్తశుద్ధి సమాజంలో వివిధ వ్యవస్థలోని నైతిక విలువలు ప్రభుత్వ ఉద్యోగిలో నిస్వార్థంఉన్నప్పుడే అవినీతి నిర్మూలన జరుగుతుంది.

ఎంతో మంది ఉద్యోగులు చిత్తశుద్ధితో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారు. వారిని గుర్తించి ప్రోత్సహిం చాలి. ప్రతిశాఖలో బాధ్యతాయుతంగా నీతిమం తంగా పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.

అదే సమయంలో అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించరాదు. మిగతా వర్గాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కొంత సామాజికబాధ్యత ఎక్కువగాఉండాలి.

ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉండే ఉద్యోగులు జవాబుదారీ తనంతో మెలగాల్సి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పరిపాలనా సంస్కరణలు ప్రజలకు నాణ్యమైన మెరుగైన పారదర్శక సేవలు అందించాలన్న సత్‌సంకల్పంతోనే అని మనమందరం గుర్తించాలి.

వివిధ శాఖలను కొన్ని శాఖల్లో విభాగాలను ప్రక్షాళన చేయడానికి పౌరసేవలను మరింత విస్తరించడానికి ఉపయుక్తం అవుతుంటే రాష్ట్రప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతుఇవ్వాలి.

ఏదో ఒక శాఖను రద్దు చేస్తారని కొన్ని శాఖలను విలీనం చేస్తారన్న వార్తలను తద్వారా పుట్టే పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

పాతకాలం నాటి పద్ధతులు చట్టాలను ఉపయోగించుకుని ప్రస్తుతం పాలనను కొనసాగించడం సాధ్యం కానప్పుడు కొత్త చట్టాలను సంస్కరణలను హృదయపూర్వకంగా ఆహ్వానించాలి.

రాబోయే సంస్కరణల్లో రూపొందించే కొత్త చట్టాల్లో వాస్తవ పరిస్థితులపై అవగాహన, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తే చట్టాలు సంస్కరణలు మరింత పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యవస్థలను సంస్కరించే సమయం ఇది.

సురేష్‌ కాలేరు, (రచయిత: రాష్ట్ర సహాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/