గిరిజన కుటుంబాలను మోసం చేసిన చరిత్ర రేణుక చౌదరిది – పువ్వాడ అజయ్

గిరిజన కుటుంబాలను మోసం చేసిన చరిత్ర రేణుక చౌదరిది అంటూ మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు రావడం రేణుకా చౌదరి లక్షణం అని, ఎంపీగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని.. మీలాగా బురద మట్టి మింగే సంస్కృతి మాకు లేదని మండిపడ్డారు పువ్వాడ.

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ మినీ ప్లీనరీ లు నిర్వహిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్లీనరిలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు సహా దాదాపు మూడు వేలకుపైగా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ..కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. అన్ని పార్టీ లకు ఖమ్మం టార్గెట్ అయ్యింది. ఇక్కడకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. కొన్ని పార్టీ ల నేతలకు నేను కలలో కూడా కనిపిస్తున్నాను. వారికి నిద్ర పట్టడం లేదు. అరేయ్..ఒరేయ్.. వాడు వీడు అంటూ నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర నాకు లేదు. నా తల్లి దండ్రులు నాకు సభ్యత, సంస్కారం నేర్పరన్నారు.

ఈ సందర్బంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన కుటుంబాలను మోసం చేసిన చరిత్ర రేణుక చౌదరిది అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు రావడం రేణుకా చౌదరి లక్షణం అని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని.. మీలాగా బురద మట్టి మింగే సంస్కృతి మాకు లేదని అన్నారు. రేణుక చౌదరి తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే పోటీ చేసి తనపై గెలవాలని రేణుకా చౌదరి కి సవాల్ విసిరారు.

‘మీలాగా నేను గుడులు ,కొండలను మింగలేదు. నేను ప్రజల్ని ముంచి రాజకీయం చేయలేదు. నాపై మాట్లాడినా ప్రతి మాటకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. న్యాయ పరంగా కూడా ఎదుర్కోవాలి. ఏమి మాట్లాడినా ఇకనుంచి ఊరుకునేది లేదు. నేను ఏ కొండలను మింగాను..ఏం దౌర్జన్యం చేశానో మీడియా నిజ నిర్దారణ చేయాలి. మీరే వెలికి తీయాలి. నేను ఇక్కడే పుట్టాను..ఇక్కడే పెరిగాను.. నీ చరిత్ర ఏంటి.. నీ పిల్లలు డ్రగ్స్ , పబ్బు ల్లో పట్టుబడ్డారు. మా పిల్లలను అలా పెంచలేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.