కుంటుంబ సతీసమేతంగా ఏపీ సీఎం ను కలిసిన మంత్రి పువ్వాడ

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సమేతంగా తాడేప‌ల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. త‌న ఇంటికి వ‌చ్చిన పువ్వాడ దంప‌తుల‌కు జ‌గ‌న్ దంప‌తులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ నెల 20న‌ పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని త‌న కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు స‌తీస‌మేతంగా వెళ్లడం జరిగింది. త‌న కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆయ‌న జ‌గ‌న్ దంప‌తుల‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. అనంత‌రం జ‌గ‌న్ నివాసం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పువ్వాడ‌… జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో త‌న తండ్రికి మంచి సంబంధాలుండేవ‌ని గుర్తు చేసుకున్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక ను అందజేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఇటీవల కురుసిన భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామాలను తెలంగాణ లో విలీనంచేయాలని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించడంతో ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు దిగారు. అయితే.. ఆ తరువాత తన ఉద్దేశ్యాన్ని పువ్వాడ వివరించడంతో.. ఆ విషయం సద్దుమణిగింది.