రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

Pawan kalyan
Pawan kalyan


Gudiwada: : రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ అన్నారు.

కృష్ణాజిల్లాలో నివార్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన పవన్‌కల్యాణ్‌ నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించేందుకు సోమవారం కంకిపాడు మీదుగా గుడి వాడకు చేరుకున్నారు.

అక్కడ నిర్వహించిన భారీ ర్యాలీలో పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. బూరగడ్డ శ్రీకాంత్‌ భారీ పూలదండతో సత్కరించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/