సీతారామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాములు సందడి కాదు

సీతారామం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధువారం సాయంత్రం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రభాస్ హాజరై ..ఫంక్షన్ కు మరింత కళ తీసుకొచ్చాడు. అంతే కాదు స్టేజ్ ఫై ఓ రేంజ్ లో సందడి చేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరిపారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా హాజరైన ప్రభాస్..స్టేజ్ పైకి వచ్చి మొదట ఏం మాట్లాడను అని షాక్‌ ఇచ్చాడు. తర్వాత ఈ సినిమా నిర్మాత స్వప్నదత్‌ వచ్చి మాట్లాడితే గానీ తాను మాట్లాడనని తెలిపాడు. దీంతో స్వప్నదత్‌ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. అనంతరం ప్రభాస్ మాట్లాడారు.

‘ఇలాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలి ‘సీతారామం’ సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మనేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్‌లో చూడండి” అని ప్రభాస్‌ పేర్కొన్నాడు. కార్యక్రమం చివర్లో రూ. 100 పెట్టి అశ్వనిదత్‌ వద్ద టికెట్ కొనుక్కోవాలని యాంకర్ సుమ చెప్పగా.. ‘నా జేబులో డబ్బులుండవు. ఇందాక నాగ్ అశ్విన్‌ వద్ద అడిగి తీసుకున్న’ అని ప్రభాస్‌ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. తర్వాత అశ్వనిదత్‌కు రూ. 100 ఇచ్చి టికెట్‌ తీసుకున్నాడు. ప్రభాస్ స్టేజ్ ఫై ఇలా సందడి చేయడం అక్కడి వారినే కాదు అభిమానులను సైతం ఆశ్చర్యంలో పడేసింది.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో ప్రాజెక్ట్ కె ఒకటి. ఈ చిత్రాన్ని నాగ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా..వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు.