నారా లోకేష్‌పై తప్పుడు పోస్టులు చేస్తున్న ఓ వర్గం ఫై పోలీసులకు పిర్యాదు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై సోషల్ మీడియా లో ఓ వర్గం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్‌ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను లోకేష్‌కు ఆపాదిస్తూ ఆయన ప్రతిష్ఠ దిగజారేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆయన నారా – నందమూరి కుటుంబాలు, అభిమానుల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఈ కేసు ప్రస్తుతం పరిశీలనలో ఉందని, న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.