విపక్షాలపై మండిపడ్డ మంత్రి పువ్వాడ

బిఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విపక్షాల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలతో ప్రజలు అల్లాడిపోతుంటే ..విపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తూ..పలు కాలనీ లు ముంచేసింది. అయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

మున్నేరు వరద బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్‌క్యాంపును మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వర రావుతో కలిసి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వెయ్యి మందికి నిత్యావసర సరుకులు అందిస్తున్నామని వెల్లడించారు. ఓ పక్క వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని పువ్వాడ మండిపడ్డారు. శుక్రవారం నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వరనగర్‌, పద్మావతి నగర్‌, మోతినగర్‌ లో భట్టి పర్యటించారు.