కంటోన్మెంట్ రోడ్డు మూసివేతపై ‘సుప్రీం’లో పిల్
ప్రజలు ఇబ్బంది పడుతున్నా మిలిటరీ అధికారులు కనికరించడం లేదంటూ పిటిషనర్ వెల్లడి

Hyderabad: కంటోన్మెంట్ రోడ్డు మూసివేతపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ రోడ్డును మిలిటరీ అధికారులు మూసి వేయటంపై సీనియర్ సిటిజన్ అనూప్ కుమార్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు.
కంటోన్మెంట్ రోడ్డు మూసి వేతతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అనూప్ కుమార్ పిల్‌లో పేర్కొన్నారు.
ఇంత మంది ఇబ్బంది పడుతున్నా మిలిటరీ అధికారులు కనికరించడం లేదంటూ పిటిషనర్ తెలిపారు.
ఈ పిల్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఇదే అంశంపై రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/