గ్లామర్ డోస్ పెంచుతున్న అనుపమ

రోజు రోజుకు అనుపమ తన గ్లామర్ డోస్ పెంచుతుందా..అంటే అవుననే అనాలి. చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది.

దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ..సోషల్ మీడియా లో హాట్ హాట్ భంగిమలతో ఆకట్టుకుంటుంది. తాజాగా అనుపమ పోస్ట్ చేసిన ఒక ఫోటోలో టాప్ డ్రెస్ లో మోకాలు కనిపించేలా పోజ్ ఇచ్చింది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ లెగ్స్ అందాలతో మతిపోయేలా చేసింది. దీంతో నెటిజన్లు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? అంటూ రొమాంటిక్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.