జనసేనలో చేరబోతున్నానని ప్రకటించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి
ఈరోజు నాగబాబును కలిసిన పృథ్వి

అమరావతిః ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి జనసేన పార్టీలో చేరబోతున్నారు. జనసేనలో చేరబోతున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈరోజు జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబును ఆయన కలిశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష ముగియగానే ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వి జనసేన కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరపున బరిలోకి దిగాలనుకుంటున్నారు. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.
కాగా, గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి పృథ్వి మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. అందుకు ప్రతిఫలంగా ఆయనను జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ గా చేశారు. అయితే, ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తొలగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/