హాస్పటల్ లో కన్నీరు పెట్టుకున్న నవనీత్..

హనుమాన్ ఛాలీసా వివాదం లో జైలుకు వెళ్లిన అమరావతి ఎంపీ నవనీత్ రాణా గురువారం జైలు నుండి బెయిల్ ఫై విడుదల అయ్యారు. జైలు నుండి బయటకు వచ్చిన ఆమె.. లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. 10 రోజుల పాటు జైల్లో ఉన్న కారణంగా అనారోగ్యంతో ఆమె ఆసుపత్రికి వెళ్లారు. నవనీత్ కౌర్ హాస్పటల్ కు వెళ్లిన చాలా సేపటికి జైలు నుంచి విడుదలైన రవిరాణా.. తన భార్య ఆసుపత్రిలో ఉందని తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్లారు.
ఈ క్రమంలో ఆసుపత్రిలో బెడ్‌పై చికిత్స తీసుకుంటున్న నవనీత్ కౌర్ భర్తను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. భార్య కన్నీటిని చూసిన రవి రాణా ఆమె కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. హనుమాన్ ఛాలీసా వివాదంలో ఎంపీ,ఎమ్మెల్యే దంపతులు ఒంటరయ్యారని, వారికి మద్దతు ప్రకటిస్తూ పలువురు కామెంట్ చేశారు. అదే సమయంలో ఈ ఫొటోలపై ట్రోలింగ్ చేస్తూ కూడా పెద్ద సంఖ్యలో కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి.